The Kerala Story tax free: ఆ రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా `ది కేరళ స్టోరీ`..టికెట్లు ఎంత తక్కువకి దొరుకుతాయంటే?
The Kerala Story tax free News: ఆదాశర్మ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలాని వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా హిందీలో విడుదలవగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు టాక్స్ ఫ్రీగా అనౌన్స్ చేశాయి.
The Kerala Story tax free in these states: ఆదాశర్మ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలాని వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన ది కేరళ స్టోరీ సినిమా హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇక ఆశ్చర్యకర రీతిలో ఈ సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కేరళలోని పలు జిల్లాలకు చెందిన యువతులు అదృశ్యమై ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థల్లో చేరేందుకు ఒక మతానికి చెందిన వారు కారణమవుతున్నారంటూ ఈ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు టాక్స్ ఫ్రీగా అనౌన్స్ చేశాయి. సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక గత వారం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ సినిమా అందరూ కచ్చితంగా చూడాల్సిన సినిమా అని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సినిమాకి టాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఈ టాక్స్ ఫ్రీ అంటే సినిమా టికెట్లు లేకుండానే సినిమాలు చూసే అవకాశం కల్పించడమే అని కొంతమంది భావిస్తున్నారు, కానీ అది నిజం కాదు.
Also Read: Controversial Movies: పఠాన్ టు కేరళ స్టోరీ.. రిలీజ్ కు ముందే వివాదాలకు కారణమైన సినిమాలివే!
ఒక్కొక్క సినిమా టికెట్ అమ్మినప్పుడు కొంత డబ్బు స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కి టాక్స్ ల రూపంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దేశ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే లేక మన దేశ చరిత్రను తెలియజేసే సినిమాలకు టాక్స్ తీసుకోకుండానే ప్రదర్శించే విధంగా అనుమతి ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కొన్ని సినిమాలను తెలుగు రాష్ట్రాలలో కూడా అలా ప్రదర్శించారు, ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇలా టాక్స్ లేకుండా సినిమా టికెట్లు అమ్మకం జరిగితే మామూలుగా టికెట్ల ధర కంటే కాస్త తగ్గుతుంది.
అంటే సాధారణంగా సినిమా చూపించడానికి ఆసక్తి చూపించిన వారు కూడా రేట్లు తగ్గుతున్నాయి. కాబట్టి వెళ్లి చూసి వద్దాం అనుకునే అవకాశాలుంటాయి. అయితే సినిమాలను కూడా జీఎస్టీ కిందకు తీసుకురావడంతో వంద లోపు టికెట్ల మీద 12 శాతం జీఎస్టీ ప్రస్తుతానికి వసూలు చేస్తున్నారు. 100 రూపాయలు పైబడి అమ్మకాలు జరిపే టికెట్ల మీద 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వాలు టాక్స్ ఫ్రీ అని ప్రకటించాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ కలుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వాటాలో చెల్లించాల్సిన మిగతా సగం టాక్స్ సినిమా టికెట్ల కొనుగోలు సమయంలో కలెక్ట్ చేయరు. అలా ఒక రకంగా సినిమా చూసే వాళ్ళ సంఖ్య పెంచడానికి కూడా ఇది కారణమవుతుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook